ప్రతి ఒక్కరూ కోవిడ్‌ టీకా వేసుకోవాలి

గాంధారి, జనవరి 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా మహమ్మారి నుండి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ కోవిడ్‌ వాక్సిన్‌ వేసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ జీతేష్‌ వి పాటిల్‌ అన్నారు. సోమవారం గాంధారి మండల కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్బంగా వాక్సినేషన్‌ ప్రక్రియను పరిశీలించారు.

పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ రెండు డోసుల టీకా వేసుకోవాలని సూచించారు. అదేవిదంగా 15 నుండి 18 సంవత్సరాల పిల్లలకు వారి తల్లితండ్రులు దగ్గరుండి టీకా వేయించుకోవాలని అన్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా (ఓమిక్రాన్‌ ) కేసులు పెరుగుతుందటంతో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కోవిద్‌ లక్షణాలున్న వారు పరీక్షలు చేసుకోవాలని అన్నారు.

కోవిద్‌ లక్షణాలున్నవారు ప్రభుత్వం ఇచ్చే కోవిద్‌ కిట్లను (మందులను) సరిగ్గా వాడాలని అన్నారు. ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లకు బూస్టర్‌ డోసు వాక్సిన్‌ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆసుపత్రిలో సిబ్బంది కొరత ఉందని స్థానిక సర్పంచ్‌ సంజీవ్‌ యాదవ్‌ కలెక్టర్‌ ద్రుష్టికి తీసుకొచ్చారు. వెంటనే జిల్లా వైద్యాధికారితో ఫోన్‌లో మాట్లాడి వారం రోజులలో సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అయన వెంట ఎంపీపీ రాధా బలరాం నాయక్‌, తహసీల్దార్‌ గోవర్ధన్‌ తదితరులు ఉన్నారు.

రైతులు కూరగాయల సాగుపై ద్రుష్టి పెట్టాలి

రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల వైపు ద్రుష్టి సారించాలని కలెక్టర్‌ జీతేష్‌ వి పాటిల్‌ అన్నారు. గాంధారి మండలం తిమ్మాపూర్‌ గ్రామంలో రైతులతో మాట్లాడారు. రైతులు వరికి బదులుగా కూరగాయల సాగు వైపు ద్రుష్టి పెట్టాలని అన్నారు. కూరగాయల సాగుతో అధిక దిగుబడి సాధించి ఎక్కువగ సంపాదించవచ్చని అన్నారు.

అనంతరం గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఉపాధి హామీ వర్కర్లతో మాట్లాడారు. కొలతలు, ఎస్టిమేట్‌ల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో వైకుంఠ థామాన్ని వారం వ్యవధిలో పూర్తి చేయాలనీ స్థానిక సర్పంచ్‌, ఎంపీటీసీలకు సూచించారు. కలెక్టర్‌ వెంట ఎంపీడీఓ సతీష్‌, తహసీల్దార్‌ గోవర్ధన్‌, ఎంపీపీ రాధా బలరాం నాయక్‌, అధికారులు తదితరులు ఉన్నారు.

Check Also

అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా జనరంజక పాలన

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »