డిచ్పల్లి, జనవరి 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని సారంగపూర్ క్యాంపస్ కళాశాలకు చెందిన ఎం.ఎడ్. రెండవ సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలు ఈ నెల 27 నుంచి జరుగవలసి ఉండగా కోవిద్ – 19 నిబంధనలను అనుసరించి వాయిదా వేస్తున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం.అరుణ ఒక ప్రకటనలో తెలిపారు.
పరీక్షలను మళ్లీ ఎప్పుడు నిర్వహించేది తదనంతరం ప్రకటిస్తామని ఆమె అన్నారు. కావున ఈ విషయాన్ని ఎం.ఎడ్. కళాశాలల ప్రధానాచార్యులు, విద్యార్థులు గమనించాలని ఆమె కోరారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటి వెబ్ సైట్ను సంప్రదించాలని ఆమె సూచించారు.