కామారెడ్డి, జనవరి 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వర్గీయ ఎన్.టి.రామారావు 26వ వర్ధంతిని పురస్కరించుకొని హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తలసేమియా వ్యాధి గ్రస్తుల కోసం నిర్వహించిన రక్తదాన శిబిరంలో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు 65 వ సారి రక్త దానం చేశారు.
టి.టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు బాలును అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 14 సంవత్సరాల నుండి వ్యక్తిగతంగా 65 సార్లు రక్తదానం చేయడమే కాకుండా రక్తదాతల సమూహం ద్వారా 10 వేల మందికి సకాలంలో రక్తాన్ని అందజేయడం మామూలు విషయం కాదని, బాలు సేవలు నేటి సమాజానికి ఆదర్శనీయమని కొనియాడారు.
కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పర్లపల్లి రవీందర్, షుకూర్, జయంత్ మైపాల్ రెడ్డి, గణేష్, బాలరాజు, రవీందర్, వంశీ, సవీందర్ అజయ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.