కామారెడ్డి, జనవరి 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా యువ మోర్చా (బిజెవైఎం) భిక్కనూరు శాఖ ఆధ్వర్యంలో ఖాళిగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని, గత ఎన్నికల హామీ ప్రకారం నిరుద్యోగ భృతి చెల్లించాలని తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బిజెవైఎం రాష్ట్ర నాయకులు నరేందర్ రెడ్డి మాట్లాడుతూ నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఉద్యోగాల భర్తీ విషయమై స్పష్టత వస్తుందని యావత్ తెలంగాణ యువత ఎంతో ఎదురు చూసిందని కానీ ఆ ఊసే లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
317 జివో ద్వారా ప్రభుత్వ ఉద్యోగులను ఇబ్బంది పెడుతూ ఉపాధ్యాయులు ఉద్యమం చేస్తారేమో అని పిల్లల భవిష్యత్తు కూడా ఆలోచించకుండా కరోనా సాకుతో విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారని, గత 14 నెలలుగా విఆర్‌వోలకు పని ఏమి చెప్పకుండా జీతాలు ఇస్తున్నారని స్వరాష్ట్రంలో ప్రభుత్వ వ్యవస్థలను అధికార తెరాస పార్టీ నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుందని అన్నారు.
తెలంగాణ వచ్చిన నాటి నుండి గ్రూప్ 1 నోటిఫికేషన్ వేయలేదని ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతిని చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని యడల రాబోయే కాలంలో బిజెవైఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని అన్నారు.