ఆర్మూర్‌ అపార్టుమెంట్‌ యజమానుల సమావేశం

ఆర్మూర్‌, జనవరి 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం ఆర్మూర్‌ పట్టణానికి చెందిన అన్ని అపార్ట్‌మెంట్‌ల యజమానులతో, అసోసియేషన్‌ అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. దొంగతనాలు జరగకుండా జాగ్త్రలు వహించాలని పలు సూచనలు చేశారు. ఎవరైనా అనుమానాస్పదంగా అపార్టుమెంట్‌లోకి వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, రాత్రి సమయాల్లో సెక్యూరిటీ కచ్చితంగా నియమించుకోవాలని సూచించారు.

అందరూ కూడా సిసి కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని, అపార్టుమెంట్‌లో ఎవరైనా ఎక్కువ రోజులు తాళం వేసుకుని ఊరికి వెళ్తునట్లైతే పోలీస్‌ స్టేషన్‌లో సమచారం ఇవ్వాలని సూచించారు. ఎప్పటికపుడు సూచనలు ఇవ్వడానికి అందరితో కలిపి ఒక వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సమావేశంలో ఎస్‌ఐ శ్రీకాంత్‌, ఏఎస్‌ఐ లీలా కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »