కామారెడ్డి, జనవరి 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎస్సి విద్యార్థులను ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు చేయించడంలో కామారెడ్డి జిల్లా రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో బుధవారం జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ అధికారుల కృషి వల్ల విద్యార్థుల ఉపకారవేతనాల దరఖాస్తులను చేయించడంలో రాష్ట్రంలో ముందంజలో నిలిచామని తెలిపారు. పెండిరగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ప్రతి నెల చివరి రోజున జరిగే పౌర హక్కుల దినోత్సవ సమావేశాలకు విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులను ఆహ్వానించాలని కోరారు.
ప్రభుత్వ పథకాలపై గ్రామ స్థాయిలో సభ్యులు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పెండిరగ్ కేసులను పోలీస్ స్టేషన్ల వారీగా వర్గీకరించి వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. గత సమావేశంలో చర్చించిన అంశాల పురోగతిని జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి రజిత వివరించారు.
సమావేశంలో ఏఎస్పీ అన్యోన్య, జిల్లా అభివ ృద్ధి అధికారి అంబాజీ, జిల్లా బి.సి.సంక్షేమ అధికారి శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, డీఎస్పీలు సోమనాథం , శశాంక్ రెడ్డి, జైపాల్ రెడ్డి, జిల్లా లెవెల్ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ మల్లికార్జున్, మల్లయ్య, రాజు, గణేష్, రాజన్న తదితరులు పాల్గొన్నారు.