ఆర్మూర్, జనవరి 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ ఎక్సైజ్ సిఐగా స్టీవెన్ సన్ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా నవనాథ పురం ప్రెస్ క్లబ్ ఆర్మూర్ సభ్యులు సన్మానించారు. బుధవారం పట్టణంలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో సన్మానం చేశారు.
ఈ సందర్భంగా నవనాథ పురం ప్రెస్ క్లబ్ ఆర్మూర్ గౌరవ అధ్యక్షులు సాత్పుతే శ్రీనివాస్, అధ్యక్ష కార్యదర్శులు నరేందర్ జాఫర్ అలీతో పాటు కార్యవర్గ సభ్యులు నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎక్సైజ్ శాఖ అధికారిని శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో నవనాథ పురం ప్రెస్‌క్లబ్ ఆర్మూర్ కోశాధికారి గంగా మోహన్, సలహాదారులు సంజీవ్, అజీం రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.