కామారెడ్డి, జనవరి 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా మత్స్య శాఖ అధికారిగా పి. శ్రీపతి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. జనగామ జిల్లా నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఇంతవరకు ఇక్కడ మత్స్యశాఖ అధికారిగా పనిచేసిన వెంకటేశ్వర్లుకు ఇంకా ఎక్కడ పోస్టింగ్ ఇవ్వలేదు.
జిల్లా మత్స్యశాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీపతి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌ను మర్యాద పూర్వకంగా కలిసి మొక్క అందజేశారు. జిల్లాలో మత్స్య శాఖ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.