అభ్యుదయానికి పట్టం కట్టిన భండారు అచ్చమాంబ

నిజామాబాద్‌, జనవరి 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆధునికతకు పట్టం కడుతూ, వందేళ్ల క్రితమే కథాసాహిత్యంలో అభ్యుదయ పంథాలో రచనలు సాగించిన రచయిత్రి భండారు అచ్చమాంబ తెలుగు కథకు బంగారు బాటలు వేసిందని తెలంగాణ విశ్వవిద్యాలయ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ వి త్రివేణి అన్నారు. బుధవారం కేర్‌ డిగ్రీ కళాశాలలో హరిదా రచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి తెలుగు కథా రచయిత్రి భండారు అచ్చమాంబ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన పుష్పార్చన కవి సమ్మేళన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా త్రివేణి మాట్లాడుతూ తెలంగాణ మహారాష్ట్ర అనుబంధాలను తమ కథలలో అచ్చమాంబ చక్కగా వివరించారు తెలిపారు. అలాగే కవయిత్రి డాక్టర్‌ ఆరుట్ల శ్రీదేవి మాట్లాడుతూ ఆధునిక భావాలున్న మహిళలందరికీ అచ్చమాంబ సాహిత్య జీవనం ఆదర్శమని అన్నారు. కార్యక్రమంలో హరిదా రచయితల సంఘం అధ్యక్షులు ఘనపురం దేవేందర్‌, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు నరాల సుధాకర్‌, కె.వి.రమణాచారి, మద్దుకూరి సాయిబాబు, డి నవీన్‌, కొయ్యాడ శంకర్‌, రమావత్‌ కిరణ్‌, వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భండారు అచ్చమాంబ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »