నసురుల్లాబాద్, జనవరి 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్న వారి పట్ల తెరాస ప్రభుత్వం వివక్ష చూపుతుందని వారికి అన్యాయం చేస్తుందని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు చందూరి హన్మాండ్లు ఆధ్వర్యంలో బుధవారం తహసిల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.
తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని, నిరుద్యోగులకు ఇవ్వాల్సిన నిరుద్యోగ భృతిని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రంలో పేర్కొన్నారు.
కార్యక్రమంలో పార్టీ మండల ప్రధాన కార్యదర్శి శంకర్, ఓబీసీ జిల్లా కార్యవర్గ సభ్యుడు సతీష్, మండల మైనారిటీ అధ్యక్షులు సమీర్, లక్ష్మణ్, శేఖర్, బబ్లు కార్యకర్తలు పాల్గొన్నారు.