కామారెడ్డి, జనవరి 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని దివ్య హస్తం సొసైటీ ఆధ్వర్యంలో దివ్యాంగులు ఏర్పాటు చేసుకున్న స్వయం ఉపాధి కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. తమ సొసైటీ ఆధ్వర్యంలో మట్టి గణపతులు, ప్రమిదలు తయారుచేసి పర్యావరణ పరిరక్షణకు దోహద పడుతున్నామని దివ్యాంగులు తెలిపారు.
దంత మంజన్, సరుపు వంటి వస్తువులను తయారు చేసి విక్రయించి ఉపాధి పొందుతున్నామని దివ్య హస్తం సొసైటి అధ్యక్షురాలు పోచవ్వ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయో వృద్ధుల సంక్షేమ అధికారి సరస్వతి పాల్గొన్నారు.