కామారెడ్డి, జనవరి 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతాపార్టీ భిక్కనూరు మండల కార్యకర్తల సమావేశం మండల కేంద్రంలో గురువారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి హాజరై మాట్లాడారు.
మండలంలో బీజేపీలో పని చేస్తున్న కార్యకర్తలను అధికార పార్టీ నాయకులు తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారని అయినప్పటికీ పార్టీ కోసం అహర్నిశలు పని చేస్తున్న కార్యకర్తలకు ధన్యవాదాలు అని, కార్యకర్తలు అందరూ సమిష్టిగా పని చేసి అలాంటి నాయకుల వ్యూహాలను తిప్పి కొట్టాలని అన్నారు.
రాష్ట్రంలో నియోజకవర్గములో నియంత పాలన నడుస్తుందని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబెడ్కర్ స్పూర్తితో ప్రజాస్వామ్య బద్దంగా దొరల ఘడిలను బద్దలు కొట్టడానికి బీజేపీ కార్యకర్తలు కంకణ బద్ధులు కావాలని ఆన్నారు. కార్యక్రమ అనంతరం జంగంపల్లి గ్రామానికి చెందిన సార్గు వెంకటి, కాచాపుర్, పెద్దమల్లారెడ్డి గ్రామాలకు చెందిన యువకులు కాషాయ కండువా కప్పుకొని బీజేపీలో చేరారు.