కామారెడ్డి, జనవరి 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైస్ మిల్లర్లు రోజు వారి లక్ష్యాలను పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో గురువారం రైస్‌మిల్లర్లతో సీఎంఆర్ యాసంగి ధాన్యం లక్ష్యాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
మిల్లుల వారీగా ఇంతవరకు మిల్లింగ్ చేసినా దాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైస్ మిల్లర్స్ మిల్లింగ్ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా సివిల్ సప్లై మేనేజర్ జితేంద్ర ప్రసాద్, జిల్లా ఇంచార్జ్ సివిల్ సప్లై అధికారి రాజశేఖర్ పాల్గొన్నారు.