Daily Archives: January 21, 2022

అధికారులు క్షేత్ర స్థాయిలో సర్వే నిశితంగా పరిశీలించాలి…

నిజామాబాద్‌, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటింటి ఆరోగ్యం సర్వే, హరితహారం మొక్కల నిర్వహణ, కొవిడ్‌ నియంత్రణకై చేపడుతున్న వాక్సినేషన్‌ కార్యక్రమాలకు అధికారులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక ప్రగతి భవన్‌ లో జిల్లా అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇంటింటి ఆరోగ్యం సర్వే వివరాల గురించి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్‌ సుదర్శనం …

Read More »

యువత సన్మార్గంలో పయనించేందుకు క్రీడలు దోహదం

నిజామాబాద్‌, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత దురలవాట్లను దూరం చేసుకుని సన్మార్గంలో పయనించేందుకు క్రీడలు ఎంతగానో దోహద పడతాయని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు తమ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ఇతోధికంగా కృషి చేస్తోందని అన్నారు. నిజామాబాదు జిల్లా కమ్మర్‌పల్లి మండల కేంద్రంలో 2 .5 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన మినీ స్పోర్ట్స్‌ …

Read More »

మహిళ శక్తి అపారమైంది

డిచ్‌పల్లి, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళల శక్తి అపారమైందని, విద్యార్థులందరు తమ జీవితంలో చక్కని లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని అందుకు అనుగుణంగా ఉన్నతమైన విజయాలు సాధించాలని లాభిశెట్టి మహేష్‌ కుమార్‌ అభిలషించారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఉమెన్స్‌ సెల్‌ ఆధ్వర్యంలో డైరెక్టర్‌ డా. అపర్ణ వర్చువల్‌ వేదికగా ఆన్‌ లైన్‌ వెబినార్‌ ‘‘శక్తి సామర్థ్యాల అన్వేషణ’’ అనే అంశంపై శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. కార్యక్రమానికి ఇంపాక్ట్‌ …

Read More »

జ్వర సర్వేకు అందరు సహకరించాలి…

కామారెడ్డి, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు కామారెడ్డి పట్టణంలోని 37 వ వార్డులో జ్వరం సర్వేను శుక్రవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. సర్వేకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. సర్వే బృందం ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబంలో ఎవరికైనా దగ్గు, జ్వరం తో బాధపడుతున్న వారు ఉన్నారా అని అడిగి …

Read More »

క్షత్రియ కుటుంబాలకు నిత్యవసర సరుకుల పంపిణీ

ఆర్మూర్‌, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని చిన్న బజార్‌లో గల ఎస్‌.ఎస్‌.కే సమాజ్‌ లక్ష్మీనారాయణ మందిరంలో యువజన సమాజ్‌ ఆధ్వర్యంలో క్షత్రియ పేద 80 కుటుంబాలకు నిత్యవసర వస్తువులు అందజేసినట్టు యువజన సమాజ్‌ అధ్యక్షులు జీ.వి. ప్రశాంత్‌, కార్యదర్శి విశ్వనాథ్‌, శ్రీను, రాజేష్‌ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి నెల మాదిరిగానే క్షత్రియ పేద కుటుంబాలకు బియ్యం పంపిణీ కార్యక్రమంలో …

Read More »

జ్వర సర్వే పరిశీలించిన కలెక్టర్‌

బోధన్‌, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ మున్సిపాలిటీ పరిధిలో హరితహరం కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న అంబం గేట్‌ వద్ద రహదారికి ఇరువైపులా అవెన్యు ప్లాంటేషన్‌ను జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే నేటి నుంచి జరుగుతున్న ఇంటింటి జ్వర సర్వేను 2వ, 20వ వార్డ్‌లలో సందర్శించారు. సర్వే జరుగుతున్న తీరును ఆశా కార్యకర్తలకు అడిగి తెలుసుకున్నారు. 70 కుటుంబల్లో …

Read More »

పివైఎల్‌ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడలు

డిచ్‌పల్లి, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రగతి శీల యువజన సంఘం పివైఎల్‌ యువనోద్యమ నాయకుడు జిల్లా తొలి కన్వీనర్‌ కామ్రేడ్‌ వేములపల్లి కిరణ్‌ కుమార్‌ 30 స్మారక వర్ధంతి సందర్భంగా డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్‌ గ్రామంలో జనవరి 30, 31 తేదీల్లో రెండురోజుల పాటు జిల్లా స్థాయి క్యారం, చెస్‌, షటిల్‌, సైక్లింగ్‌, బీడీ కార్మికులకు బీడీలు చుట్టుట వివిధ రకాల క్రీడలు నిర్వహిస్తున్నట్టు …

Read More »

మూడు సూత్రాలు పాటిస్తే వ్యాధి రాదు…

కామారెడ్డి, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తాడ్వాయి మండలం కృష్ణాజి వాడిలో శుక్రవారం జ్వరం సర్వేను జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. కరోనా వ్యాధి రాకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించడమే శ్రీరామరక్ష అన్నారు. కరోనా వ్యాధి వచ్చాక ఇబ్బందులు పడే కంటే వ్యాధి రాకుండా మూడు సూత్రాలు పాటిస్తే వ్యాధి రాదని సూచించారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కు ధరించాలని, భౌతిక …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »