నిజాంసాగర్, జనవరి 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండలం వెల్గనూర్ గ్రామంలో మండల పరిషత్ నిధులు ఐదు లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న డ్రైనేజీ పనులను టిఆర్ఎస్ సీనియర్ నాయకులు దుర్గా రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విఠల్, వైస్ ఎంపీపీ మనోహర్, సర్పంచుల సంఘం అధ్యక్షులు రమేష్ గౌడ్ కలసి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో అభివృద్ధి కోసం డ్రైనేజీ పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు జనార్ధన్, మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్, తదితరులు ఉన్నారు.