ఆర్మూర్, జనవరి 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నవనాథ పురం ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125 వ జయంతి సందర్భంగా తపస్విని తేజో నిలయంలో పిల్లలకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. అలాగే తపస్విని తేజో నిలయం నిర్వాహకులైన నరేష్‌కి, నిర్మలకి, స్వరూపకి సన్మానం చేశారు.
ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు పుప్పాల శివరాజ్ కుమార్ మాట్లాడుతూ నేతాజీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ దేశం కోసం ధర్మం కోసం పాటుపడిన వ్యక్తి అని స్వతంత్రం కోసం ఆజాద్ హింద్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి యువకుల్ని దేశభక్తులుగా తీర్చిదిద్దారని అన్నారు. ఈరోజు భారత ప్రభుత్వం పరాక్రమ దివస్‌గా ప్రకటించి వారి విగ్రహాన్ని ఢల్లీిలో స్థాపించడం గొప్ప విషయమని ప్రతి ఒక్కరు నేతాజీ అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ప్రాజెక్టు చైర్మన్ సత్యనారాయణ, కో చైర్మన్ చెన్న రవికుమార్, సీనియర్ సభ్యులు హరి నారాయణ, లయన్ మోహన్ దాస్, లియో రమణ, కిరణ్, పాఠశాల యాజమాన్యం, సిబ్బంది పాల్గొన్నారు.