కామారెడ్డి, జనవరి 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాకు చెందిన ఖాసిం (49) నారాయణ వైద్యశాల హైదరాబాదులో గుండె ఆపరేషన్ నిమిత్తమై ఏ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు. దీంతో దోమకొండకి చెందిన హైదరాబాదులో నివాసం ఉంటున్న సనత్ కుమార్ శర్మకు తెలియజేయడంతో వెంటనే స్పందించి 62వ సారి రక్తదానం చేసి మానవతా దృక్పథాన్ని చాటారు.
కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని 2007 లో ఏర్పాటు చేసిన నాటి నుండి ఇప్పటివరకు ఎన్నో సందర్భాల్లో వారి సహాయ సహకారాలు అందించడం జరిగిందని వారికి కృతజ్ఞతలు తెలిపారు.