నిజామాబాద్, జనవరి 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఫిబ్రవరిలో జరగనున్న కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ నందు మధ్య తరగతి ఉద్యోగుల పన్ను పరిమితిని పది లక్షలకు పెంచాలని, పెన్షనర్లకు ఎలాంటి ఆదాయం లేనందున ఆదాయపు పన్ను పూర్తిగా మినహాయించాలని, ఆదివారం జిల్లా అధ్యక్షులు శాస్త్రుల దత్తాత్రేయ రావు అధ్యక్షతన జరిగిన తెలంగాణ ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా కమిటీ సమావేశం డిమాండ్ చేసింది.
అదే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన డీ.ఏ లలో జనవరి 2020 నుండి జూన్ 2021 వరకు రావలసిన 18 నెలల డిఎ బకాయిలను ఎగ్గొట్టడం సరైనది కాదని, ప్రజలకు, సమాజానికి సేవలందించిన వారిని దృష్టిలో ఉంచుకొని 18 నెలల బకాయిలు విడుదల చేయాలని, సంఘం డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు, ఉద్యోగులకు ఉపయోగపడే సి.జి.హెచ్.ఎస్. వెల్నెస్ సెంటర్‌ను నిజామాబాద్‌లో ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.
సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కే. రామ్మోహన్‌రావు, ఉపాధ్యక్షులు జార్జ్, ముత్తారం నరసింహ స్వామి, ఈ.వి.ఎల్. నారాయణ, అట్లూరి మురళి కృష్ణ, కార్యదర్శులు లావు వీరయ్య, సిర్ప లింగం, రాధాకృష్ణ, నిజామాబాద్ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు హనుమాన్లు, హమీద్ ఉద్దీన్, కోశాధికారి డి. లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.