కామారెడ్డి, జనవరి 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 25న మంగళవారం ఉదయం 11 గంటలకు ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కామారెడ్డి నియోజకవర్గంలోని చిరు వ్యాపారులకు రూ. 50 వేల చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేయనున్నారని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్ తెలిపారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెడ్పి చైర్ పర్సన్ శోభ, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి హాజరవుతారని చెప్పారు.