ఆర్మూర్, జనవరి 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం ఆర్మూర్ రూరల్ మండల రేషన్ డీలర్ల సమావేశం పెర్కిట్ ఎం.ఆర్. గార్డెన్స్‌లో జరిగింది. సమావేశంలో ఆర్మూరు రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆర్మూరు మండల రూరల్ అద్యక్షులుగా మల్లెల గంగారాం (మచ్చర్ల), ప్రధాన కార్యదర్శిగా కామని నరేష్ (పేర్కిట్), ఉపాధ్యక్షులుగా అబ్దుల్ అజీమ్ (పేర్కిట్), కోశాధికారిగా సుద్దపల్లి సురేష్ (మామిడిపల్లి), సలహాదారుగా లింగమయ్య (దేగాం) ఏకక్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా తమవంతు బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తామని అదేవిధంగా అధికారులను డీలర్లను సమన్వవయపరుస్తామని, రేషన్ డీలర్ల సమస్యలను అతిత్వరలో పరిష్కరిస్తామని రేషన్ డీలర్ల సంక్షేమానికి కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో ఆర్మూరు మండల రేషన్ డీలర్లు పాల్గొన్నారు.