కామారెడ్డి, జనవరి 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణ బీజేపీ మైనారిటీ మోర్చా కమిటీని పట్టణ అధ్యక్షుడు నేహల్ ఏర్పాటు చేశారు. అనంతరం పట్టణ మైనారిటీ మోర్చా నూతన కమిటీ సభ్యులు బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం కమిటీ సభ్యులను ఆయన సన్మానించారు.
ఈ సందర్భంగా రమణా రెడ్డి మాట్లాడుతూ బీజేపీ ఏ ఒక్క కులానికో, ఏ ఒక్క మతానికో, ఏ ఒక్క ప్రాంతానికో వ్యతిరేకం కాదు అని భారతదేశంలోని కాశ్మీర్ నుండీ కన్యాకుమారి వరకు ప్రతి భారతీయుడి కోసం బీజేపీ పని చేస్తుందన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సబ్ కా సాత్- సబ్ కా వికాస్- సబ్ కా విశ్వాస్ నినాదంతో గత 7 సంవత్సరాలుగా ముందుకు సాగుతోందని దాని ఫలితమే సగానికి పైగా రాష్ట్రాల్లో బిజేపీ అధికారంలో ఉందన్నారు. వచ్చే నెలలో జరిగే 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా బీజేపీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.