ధరణి టౌన్‌ షిప్‌ దరఖాస్తుదారులకు ముఖ్య గమనిక

కామారెడ్డి, జనవరి 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ధరణి టౌన్‌ షిప్‌ రిజిస్ట్రేషన్‌ రుసుము రూ. 3000 దరఖాస్తుదారునికి తిరిగి చెల్లించుటకు సంబంధిత పత్రాలతో ఈనెల 28 లోపు కామారెడ్డి కలెక్టరేట్లోని హెచ్‌ సెక్షన్‌లో కలవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ కోరారు.

సంబంధిత దరఖాస్తుదారులు ఈ సేవ రసీదు, ఆధార్‌ కార్డు, బ్యాంక్‌ పాస్‌ పుస్తకం, పాన్‌ కార్డు జిరాక్స్‌ కాఫీలతో దరఖాస్తు చేసుకున్నచో మీరు చెల్లించిన రుసుము తిరిగి చెల్లిస్తారని చెప్పారు. పూర్తి వివరాలకు 08468 220069 ను సంప్రదించాలని సూచించారు. జనవరి 29 తర్వాత దరఖాస్తుదారులు తెలంగాణ రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ హైదరాబాద్‌ వారిని సంప్రదించాలని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని దరఖాస్తుదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »