శ్రీ నిధి ఎక్స్‌గ్రేషియా అందజేసిన కలెక్టర్‌

కామారెడ్డి, జనవరి 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సెర్ప్‌ సమన్వయకర్త ఆలే శ్రీనివాస్‌ పిట్లం మండలంలో విధులు నిర్వర్తిస్తూ అనారోగ్య కారణాల వల్ల ఆగస్టు 31,2021 న మృతి చెందారు. శ్రీ నిధి ద్వారా రూ.1.50 లక్షల ఎక్స్‌ గ్రేషియా మంజూరైంది. జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, శ్రీనివాస్‌ భార్య నాగజ్యోతికి మంగళవారం చెక్కును అందజేశారు.

సెర్ప్‌ సిబ్బంది ఏదైనా కారణం చేత మృతి చెందితే మృతుడి కుటుంబానికి శ్రీ నిధి ద్వారా ఎషియా ఇవ్వబడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, డిఆర్‌డిఓ వెంకట మాధవరావు, శ్రీనిధి జోనల్‌ మేనేజర్‌ రవికుమార్‌ పాల్గొన్నారు.

Check Also

రేపు విద్యుత్‌ అంతరాయం

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »