కామారెడ్డి, జనవరి 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డిలో మంగళవారం జ్వరం సర్వేను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు.
కోవిడ్ లక్షణాలున్నవారికి మందుల కిట్ అందజేయాలని సూచించారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కు ధరించాలని కోరారు. వ్యాపార సంస్థల వద్ద భౌతిక దూరం పాటించాలని పేర్కొన్నారు. 15 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు కోవిడ్ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని కోరారు.