కామారెడ్డి, జనవరి 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటు హక్కు పవిత్రమైందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటు హక్కును ప్రతి ఎన్నికల్లో వినియోగించుకోవాలని కోరారు.
కొత్త ఓటర్లకు ధన్య వాదాలు తెలిపారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థను ఓటు హక్కు ద్వారా నిలబెట్టుకునే అవకాశం ఉందని చెప్పారు. ఓటర్లు నిష్పక్షపాతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ఓటర్ల నమోదు, ఓటర్ల చైతన్యవంతం చేయడంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఓటర్లు ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు నచ్చనిచో నోటాకు ఓటు వేసేలా ఏర్పాటు చేసిందన్నారు.
ప్రపంచ దేశాలతో సమానంగా ఈవీఎంలతో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తోందన్నారు. సులభతర ఓటింగ్ నమోదు ప్రక్రియ మన ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. ఓటు వేయడం ఒక హక్కు, బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. కొత్త ఓటర్లకు గుర్తింపు కార్డులను అందజేశారు.
ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించారు. వ్యాసరచన, షార్ట్ ఫిలిం పోటీలలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. సమావేశంలో జిల్లా స్థానిక సమస్తల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, అడిషనల్ ఎస్పీ అన్యోన్య, కలెక్టరేట్ ఎన్నికల సూపరింటెండెంట్ సాయి భుజంగరావు, స్విప్ నోడల్ అధికారి శంకర్, అధికారులు పాల్గొన్నారు.