ఆర్మూర్, జనవరి 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణం శ్రీ చైతన్య పాఠశాలలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ప్రిన్సిపాల్ ముత్తు నందిపాటి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా గణతంత్ర దినోత్సవం ఔన్నత్యాన్ని, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి ఫలితమే గణతంత్ర దినోత్సవం అని కొనియాడారు.
ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా పవిత్రమైనదని, నేటి విద్యార్థులను రేపటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దె బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. కార్యక్రమంలో డీన్ వెంకటేష్, సీ బ్యాచ్ ఇంచార్జి సంతోష్, ప్రైమరీ ఇంచార్జి ప్రసన్న, ప్రీ ప్రైమరీ ఇంచార్జి శ్రీ విద్య, ఏ. ఓ. మోహన్, పి.ఈ.టీ లు శ్రీనివాస్, మీనా, పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.