కామారెడ్డి, జనవరి 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని అడ్లూరు శివారులో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్లో నిర్మించిన గృహాలను, స్థలాలను గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. పిచ్చి మొక్కల తొలగింపు పనులను పూర్తిచేయాలని కోరారు.
ఫార్మేషన్ రోడ్లు వేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, మునిసిపల్ అధికారులు పాల్గొన్నారు.