ఫిబ్రవరి 9 వరకు డిగ్రీ పరీక్ష ఫీజు గడువు

డిచ్‌పల్లి, జనవరి 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలో గల బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ. కోర్సులకు చెందిన మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్‌ థియరీ పరీక్షల ఫీజు గడువు వచ్చే నెల ఫిబ్రవరి 9 వ తేదీ వరకు ఉందని పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్‌ ఎం. అరుణ షెడ్యూల్‌ విడుదల చేశారు.

అంతేగాక 100 రూపాయల అపరాధ రుసుముతో ఫిబ్రవరి 11 వ తేదీ వరకు, 500 రూపాయల అపరాధ రుసుముతో ఫిబ్రవరి 15 వ తేదీ వరకు, 1000 రూపాయల అపరాధ రుసుముతో ఫిబ్రవరి 17 వ తేదీ వరకు, 2000 రూపాయల అపరాధ రుసుముతో ఫిబ్రవరి 19 వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని ఆమె పేర్కొన్నారు.

ఈ విషయాన్ని డిగ్రీ కళాశాలల ప్రధానాచార్యులు, విద్యార్థులు గమనించాలని కోరారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటి వెబ్‌ సైట్‌ను సందర్శించాలని సూచించారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శుక్రవారం, నవంబరు 22, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »