డిచ్పల్లి, జనవరి 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం మహిళా విభాగం ఆధ్వర్యంలో షీ టీం, నిజామాబాద్ సౌజన్యంతో ఈ నెల 30 వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు ‘‘సైబర్ నేరాలు – మహిళా సంరక్షణ’’ అనే అంశం మీద అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ డా. కె. అపర్ణ ఒక ప్రకటనలో తెలిపారు.
కార్యక్రమంలో షీ టీం, నిజామాబాద్ మహిళా కానిస్టేబుల్స్ పి. రేఖా రాణి, టి. హరితా రాణి వర్చువల్ వేదికగా ఆన్ లైన్లో హాజరై విద్యార్థులకు అవగాహన కలిగిస్తారని అన్నారు. కావున తెలంగాణ విశ్వవిద్యాలయ మహిళా విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని అత్యాధునిక జీవన విధానంలో అత్యంత శర వేగంగా వ్యాపిస్తున్న సైబర్ నేరాల గురించి సమాచారం తెలుసుకొని జాగ్రత్త వహించాలని కోరారు.