ఉద్యోగాలు వెంటనే భర్తీచేయాలి…

బోధన్‌, జనవరి 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు శివసేన రెడ్డి ఆదేశాల మేరకు బోధన్‌ నియోజకవర్గ యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు బోధన్‌ ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌ ముట్టిడిరచారు.

ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేయక నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు పాల్పడినా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదని, నిరుద్యోగ భృతి ఇస్తాం అని మూడు సంవత్సరాలు దాటిన ఇప్పటి వరకు దాని ఉసే లేదన్నారు. ఒక్కొక నిరుద్యోగికి రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయలపైగా బాకి ఉందని, వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేసి ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు.

ఈ సందర్భంగా పోలీసులు యూత్‌ కాంగ్రెస్‌ నాయకులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో రూరల్‌, టౌన్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు నరేందర్‌ రెడ్డి, గంగాధర్‌ గౌడ్‌, జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షులు దొడ్ల రవీందర్‌ రెడ్డి, యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు షేక్‌ ఫర్హాన్‌, జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి రాజు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ప్రసాద్‌, బోధన్‌ టౌన్‌, రూరల్‌ మండలల అధ్యక్షులు నవీన్‌ తలారి, ఖజపుర్‌ అశోక్‌, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ప్రమోద్‌, యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు ఇన్నయత్‌, అబ్దుల్‌ సజీడ్‌, శ్రీకాంత్‌ అబ్బొల్ల, సంతోష్‌, ఇమ్రాన్‌ ఖాన్‌, సాయి కృష్ణ, షేక్‌ ఫాయాజ్‌, సాయద్‌ సల్మాన్‌, లోక కృష్ణ, సలోద్దిన్‌, అనిల్‌ చిద్రపు, ప్రకాష్‌, యగ్నేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »