Daily Archives: January 30, 2022

రేపటి ప్రజావాణి రద్దు

కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 31న సోమవారం కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించు ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా వ్యాధి వ్యాప్తి , కేసులు పెరుగుతున్న దృష్ట్యా 31న సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి …

Read More »

యువజన సంఘాన్ని విస్తరించడం కోసం కిరణ్‌ కుమార్‌ కృషిచేశారు

నిజామాబాద్‌, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రగతిశీల యువజన సంఘం పీవైఎల్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఎన్‌ఆర్‌ భవన్‌లో కామ్రేడ్‌ వేములపల్లి కిరణ్‌ కుమార్‌ వర్ధంతి సందర్భంగా పూలమాలలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా పౌర హక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆల్గోటు రవీందర్‌, పివైఎల్‌ జిల్లా అధ్యక్షుడు కిషన్‌ మాట్లాడుతూ పీవైఎల్‌ జిల్లా తొలి కన్వీనర్‌ అయిన వేములపల్లి కిరణ్‌ …

Read More »

అభివృద్ధి పనులపై బహిరంగ చర్చకు సిద్ధం

కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మున్సిపల్‌ పరిధిలో నూతన పాలకవర్గం ఏర్పాటు తర్వాత జరిగిన అభివృద్ధి పనుల విషయంలో, అవినీతి విషయంలో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, తేదీ, సమయం, స్థలం అధికార పార్టీ కౌన్సిలర్లు చెప్పాలని బీజేపీ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ మోటూరి శ్రీకాంత్‌ అన్నారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత పాలక …

Read More »

మార్కెట్‌ సముదాయం పనులు పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి గాంధీ గంజిలో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్‌ సముదాయం పనులను ఆదివారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని గుత్తేదారును ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, తహసీల్దార్‌ ప్రేమ్‌ కుమార్‌, గుత్తేదారు మధుసూదన్‌ రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Read More »

ఈవిఎం భవనం ప్రారంభించిన అధికారులు

కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈవీఎం భవనంను ఆదివారం చీఫ్‌ ఎలక్ట్రోరల్‌ ఆఫీసర్‌, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ శశాంక్‌ గోయల్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈవీఎం, వివి ప్యాట్ల్‌ను ఈ భవనంలో భద్రపరుచుకోవచ్చునని సూచించారు. అంతకుముందు ఆయనకు జిల్లా అధికారులు మొక్కలు అందించి స్వాగతం పలికారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, జిల్లా …

Read More »

మహాశివరాత్రి జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు

వేములవాడ, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర పుణ్యక్షేత్రంలో జరగబోయే మహాశివరాత్రి జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి 28, మార్చి 1, 2 వ తేదీల్లో జరగనున్న మహాశివరాత్రి జాతర మహోత్సవాల ఏర్పాట్లపై వేములవాడ ఆలయంలోని ఓపెన్‌ స్లాబ్‌ సమావేశ మందిరంలో ఇటీవల జిల్లా …

Read More »

రాజీవ్‌ స్వగ ృహ ప్లాట్లకు హద్దులు నిర్ధారణ

కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని అడ్లూర్‌ గ్రామ శివారులో గల రాజీవ్‌ స్వగృహ పథకానికి సంబంధించిన ప్లాట్లకు హద్దులు గుర్తించామని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. ఆదివారం రాజీవ్‌ స్వగృహ పథకం ప్లాట్లను, గృహాలను పరిశీలించారు. గృహాల చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా మార్చాలని అధికారులకు సూచించారు. ప్లాట్లకు నెంబర్లను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ …

Read More »

బాలికలకు ఆత్మరక్షణకోసం కరాటే తప్పనిసరి

వేములవాడ, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాలికలకు ఆత్మరక్షణ కోసం కరాటే ఎంతో అవసరమని వేములవాడ అర్బన్‌ ఎంపీపీ బూర వజ్రమ్మ బాబు అన్నారు ఆదివారం వేములవాడ పట్టణంలోని బింగి మహేష్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఓకి నవాకరాటే అకాడమీ విద్యార్థులకు బెల్ట్‌ గ్రేడిరగ్‌ పరీక్ష నిర్వహించారు. దాదాపు 50 మంది విద్యార్థులు బెల్ట్‌ పోటీలలో ప్రతిభ కనబర్చగా వారికి బెల్టు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య …

Read More »

అసభ్యకరమైన పోస్ట్‌ పెడితే లక్ష రూపాయలు జరిమానా

డిచ్‌పల్లి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో మహిళా విభాగం ఆధ్వర్యంలో షీ టీం, నిజామాబాద్‌ సౌజన్యంతో డైరెక్టర్‌ డా. కె. అపర్ణ ఆదివారం ‘‘సైబర్‌ నేరాలు – మహిళా సంరక్షణ’’ అనే అంశం మీద అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో షీ టీం, నిజామాబాద్‌ మహిళా కానిస్టేబుల్స్‌ పి. రేఖా రాణి, టి. హరితా రాణి వర్చువల్‌ వేదికగా ఆన్‌ లైన్‌లో హాజరై …

Read More »

కామారెడ్డి జిల్లా జెఆర్‌సి, వైఆర్‌సి కోఆర్డినేటర్‌గా బాలు

కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా జూనియర్‌ రెడ్‌ క్రాస్‌, యూత్‌ రెడ్‌ క్రాస్‌ కో ఆర్డినేటర్‌గా కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు, సేవాతత్పరతను గుర్తించి బాలును ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. గత 14 సంవత్సరాల నుండి వ్యక్తిగతంగా 65 సార్లు, కరోనా సమయంలో 980 యూనిట్ల రక్తాన్ని, 100 యూనిట్ల ప్లాస్మాను, రక్తదాతల సమూహం ద్వారా 10వేల యూనిట్లకు పైగా రక్తాన్ని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »