కామారెడ్డి, జనవరి 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా జూనియర్ రెడ్ క్రాస్, యూత్ రెడ్ క్రాస్ కో ఆర్డినేటర్‌గా కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు, సేవాతత్పరతను గుర్తించి బాలును ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.
గత 14 సంవత్సరాల నుండి వ్యక్తిగతంగా 65 సార్లు, కరోనా సమయంలో 980 యూనిట్ల రక్తాన్ని, 100 యూనిట్ల ప్లాస్మాను, రక్తదాతల సమూహం ద్వారా 10వేల యూనిట్లకు పైగా రక్తాన్ని అందజేసి వేలాది మంది ప్రాణాలను కాపాడినందుకుగాను చేసిన సేవలను గుర్తించి కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ కొమ్ముల తిరుమల్ రెడ్డికి, ఈ ఎంపికకు సహకరించిన రెడ్ క్రాస్ జిల్లా కమిటీ సభ్యులందరికీ బాలు కృతజ్ఞతలు తెలిపారు.