కామారెడ్డి, జనవరి 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 31న సోమవారం కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించు ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
కరోనా వ్యాధి వ్యాప్తి , కేసులు పెరుగుతున్న దృష్ట్యా 31న సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కలెక్టర్ కోరారు.