కామారెడ్డి, జనవరి 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని అడ్లూర్ గ్రామ శివారులో గల రాజీవ్ స్వగృహ పథకానికి సంబంధించిన ప్లాట్లకు హద్దులు గుర్తించామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఆదివారం రాజీవ్ స్వగృహ పథకం ప్లాట్లను, గృహాలను పరిశీలించారు. గృహాల చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా మార్చాలని అధికారులకు సూచించారు. ప్లాట్లకు నెంబర్లను ఏర్పాటు చేశారు.
కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, తహసిల్దార్ ప్రేమ్ కుమార్, సర్వేయర్, రెవెన్యూ, మునిసిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.