వేములవాడ, జనవరి 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాలికలకు ఆత్మరక్షణ కోసం కరాటే ఎంతో అవసరమని వేములవాడ అర్బన్ ఎంపీపీ బూర వజ్రమ్మ బాబు అన్నారు ఆదివారం వేములవాడ పట్టణంలోని బింగి మహేష్ ఫంక్షన్ హాల్‌లో ఓకి నవాకరాటే అకాడమీ విద్యార్థులకు బెల్ట్ గ్రేడిరగ్ పరీక్ష నిర్వహించారు. దాదాపు 50 మంది విద్యార్థులు బెల్ట్ పోటీలలో ప్రతిభ కనబర్చగా వారికి బెల్టు సర్టిఫికెట్లు అందజేశారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ బూర వజ్రమ్మ బాబు పాల్గొని మాట్లాడారు. ప్రతి విద్యార్థి చదువుతో పాటు ఆటలో మార్షల్ ఆర్ట్స్‌పై దృష్టి సారించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు. కార్యక్రమంలో కరాటే ఛీఫ్ ఎగ్జామినర్, మాస్టర్ ఎం.ఏ మన్నాన్, కౌన్సిలర్లు బింగి మహేష్, అన్నారపు శ్రీనివాస్, గోలీ మహేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పీర్ మహమ్మద్, సీనియర్ బ్లాక్ బెల్ట్ గ్రహీతలు, జిల్లా స్పోర్ట్స్ కరాటే సంఘం నాయకులు ఆర్ విజయ్, మంగళగిరి శ్రీనివాస్, ఎ రజినీకాంత్, యువ దీపం చైతన్య ఫౌండేషన్ అధ్యక్షుడు శేఖర్ సైన్యాధిపతి, వేములవాడ చారిటబుల్ ట్రస్టు సభ్యుడు ప్రతాప్ నటరాజ్, తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమానికి ముందుగా జిల్లా కరాటే అసోసియేషన్‌కు సహాయ సహకారాలు అందించే సీనియర్ జర్నలిస్ట్, గౌతమ్ మోడల్ స్కూల్ కరస్పాండెంట్ బుర్ర రమేష్, అలాగే కరాటే ఇన్స్పెక్టర్లు, రాచకొండ దామోదర్, మౌలాలి, అకాల మృతిపట్ల రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్దాంజలి ఘటించారు.