కామారెడ్డి, జనవరి 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2021-22 ఆర్థిక సంవత్సరంలో కామారెడ్డి నియోజకవర్గంలోని గ్రామీణ రోడ్డు మరమ్మత్తులకు 7 కోట్ల 6 లక్షల 70వేల రూపాయలు మంజూరైనట్టు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఒక ప్రకటనలో తెలిపారు.
బిక్నూర్ మండలం జంగంపల్లి బిటి రోడ్ 24 లక్షలు, బస్వాపూర్ ఎస్సి వాడ 57 లక్షలు, చాకలి వాడ 22 లక్షలు, బిక్నూర్ నుండి సిద్దిరామేశ్వర టెంపుల్ 24 లక్షలు, ర్యాగాట్లపల్లి నుంచి గర్జకుంట 80 లక్షలు, ఎన్‌హెచ్ 7 నుండి పెద్దమల్లరెడ్డి ఆర్‌అండ్‌బి రోడ్ 64.80 లక్షలు, అయ్యవారిపల్లి ఆర్‌అండ్‌బి రోడ్ 16 లక్షలు, కాంచర్ల నుండి బైపాస్ రోడ్ 11.20 లక్షలు, పెద్దమల్లరెడ్డి నుండి ఉప్పర్ పల్లి వరకు 23.40 లక్షలు బిబిపేట్ మండలం మల్కాపూర్ నుండి తుజాల్పూర్ వరకు బిటి రోడ్ 42.20 లక్షలు, పిడబ్ల్యుడి రోడ్ నుండి రామచంద్రపూర్ వరకు 29 లక్షలు, తుజాల్పూర్ నుండి ఆకారం వరకు బిటి రోడ్‌కు 54 లక్షలు దోమకొండ మండలం ముత్యంపెట్ జడ్‌పి రోడ్ నుండి అంబారిపేట జడ్‌పి రోడ్ వరకు బిటి రోడ్‌కు 38.40లక్షలు, ముత్యంపెట్ నుండి భవానిపెట్ వరకు 4.80 లక్షలు కామారెడ్డి మండలం లింగపూర్ నుండి ఖండసారి షుగర్ ఫ్యాక్టరీ వరకు బిటి రోడ్ 26 లక్షలు మాచారెడ్డి మండలం పిడబ్ల్యుడి రోడ్ దోమకొండ నుండి ఎల్పుగొండ వరకు 1కోటి రూపాయలు, పిడబ్ల్యుడి రోడ్ నుండి జడ్‌పి రోడ్ వరకు కొత్తపల్లి మాచారెడ్డి వరకు 3.20 లక్షలు, జడ్‌పి రోడ్ నుండి సార్ధపూర్ తండా వరకు 4.60 లక్షలు, ఆర్‌అండ్‌బి రోడ్ నుండి నెమలి గుట్ట తండా వరకు 8.90 లక్షలు రాజంపేట్ మండలం ఎన్‌హెచ్ 7 నుండి తలమడ్ల నుండి పొందుర్తి వరకు బిటి రోడ్‌కు 74.20 లక్షలు మొత్తం నియోజకవర్గంలో రోడ్లకు 7 కోట్ల 6 లక్షల 70వేల రూపాయలు మంజూరు అయ్యాయన్నారు.