హైదరాబాద్, జనవరి 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భరత్ భూషణ్ తెలంగాణ అస్తిత్వ విలువలు కలిగిన ఒక ఫోటో గ్రాఫర్, ఆయన మరణం ఫోటో గ్రఫీకి, తెలంగాణ ధోరణలకి తీరని లోటు, బతుకమ్మ, తెలంగాణ పల్లె థీమ్‌గా ఆయన ఫోటో గ్రఫీని అత్యున్నత ఫోటోలుగా భావించవచ్చని, చిత్రకారుడిగా నాలుగు దశాబ్దాలపాటు కొనసాగి, చివరిగా అనారోగ్యం పాలైనా, తన వృత్తిని కాపాడుకుంటూ భరత్ భూషణ్ మేటిగా నిలిచారని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు.
మీడియా అకాడమి కూడా ఆయన అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆర్థిక సాయం చేసినా కూడా కాపాడుకోలేక పోయిందని, ఆయన మృతికి తీవ్ర సంతాపం ప్రకటిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.