కామరెడ్డి, జనవరి 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంకితభావంతో పనిచేసిన ఉద్యోగులే ప్రజల మన్ననలు పొందుతారని డిఆర్‌డివో పిడి వెంకట మాధవరావు అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా గణాంక అధికారిణి మహిజదేవి స్వచ్ఛంద పదవీ విరమణ సన్మాన సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
33 ఏళ్ల పాటు ఆమె విశేష సేవలందించారని కొనియాడారు. ప్రభుత్వ ఉద్యోగులకే ప్రజలకు సేవ చేసే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమెకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా చీఫ్ ప్లానింగ్ అధికారి రాజారాం, టిఎన్‌జివోఎస్ జిల్లా అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సాయిలు, విశ్రాంత విద్యాధికారి రవీందర్, ఉప గణాంక అధికారి శివకుమార్, ఉద్యోగులు పాల్గొన్నారు.