కామారెడ్డి, జనవరి 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం అడ్లూరు గ్రామ శివారులోని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సహాయ కేంద్రాన్ని సోమవారం ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. రాజీవ్ స్వగృహలో విద్యుత్తు, తాగునీరు, రోడ్ల నిర్మాణం చేపట్టాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు.
బిటి రోడ్డు నిర్మాణానికి ఆర్అండ్బీ శాఖ అధికారులు ప్రతిపాదనలు తయారు చేయాలని పేర్కొన్నారు. గృహాల, ప్లాట్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, టౌన్ ప్లానింగ్ అధికారిణి శైలజ, తహసీల్దార్ ప్రేమ్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.