కామారెడ్డి, జనవరి 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా న్యాయవాదుల సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షులు కామారెడ్డి బార్ అసోసియేషన్ సభ్యులు ఎంకె ముజీబ్ ఉద్దీన్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కోర్ట్ బార్ అసోసియేషన్ హాలులో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి విచ్చేసిన ముజీబ్ ఉద్దీన్ మాట్లాడుతూ న్యాయవాదులకు, తగినంత సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
బార్ అసోసియేషన్ అధ్యక్షులు గజ్జెల బిక్షపతి మాట్లాడుతూ తమ వంతు సహకారం ఎల్లవేళలా ఉంటుందని పేర్కొన్నారు. న్యాయవాదుల శ్రేయస్సుకోసం కృషి చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రతినిధులు బోరెడ్డి దామోదర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, నిమ్మ దామోదర్ రెడ్డి, నంద రమేష్, రాజ గోపాల్ గౌడ్ జోగుల గంగాధర్, దేవుని సూర్య ప్రసాద్, గోనెల జగన్నాథం, శంకర్ రెడ్డి, సి రమేష్, నరసింహారెడ్డి, గుడ్ల శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, చంద్రశేఖర్, లక్ష్మణరావు, అమృత రావు, శ్యామ్ గోపాల్ రావు, మోహన్ రావు, దేవేందర్ గౌడ్, సంజీవ రావు, శేషు, షబానా, లతా రెడ్డి, భక్తుల నారాయణ, సీనియర్ న్యాయవాదులు, జూనియర్ వాదులు తదితరులు పాల్గొన్నారు.