Monthly Archives: January 2022

మృత్యుంజయ హోమంలో పాల్గొన్న ఎంపి

కామారెడ్డి, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్యసమాజ్‌లో ప్రధాని ఆరోగ్యం బాగుండాలని బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన మృత్యుంజయ హోమం కార్యక్రమంలో నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఏడున్నర సంవత్సరాల్లో దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి ప్రధాని మోడీ అని, అలాంటి వ్యక్తిని నడిరోడ్డుపై 20 నిమిషాల పాటు ఉంచిన ఘటనపై అక్కడి …

Read More »

విశ్వవిద్యాలయాలు అప్రమత్తంగా ఉండాలి…

డిచ్‌పల్లి, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సోమవారం ఉదయం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ఆచార్య ఆర్‌ లింబాద్రి అధ్యక్షతన కార్యక్రమం జరిగిందని వీసీ అన్నారు. ఇందులో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో పాటుగా తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్‌ …

Read More »

రైతుబంధు ప్రపంచానికి ఆదర్శం

బాన్సువాడ, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం రైతుబంధు ఉత్సవాల్లో భాగంగా బాన్సువాడ పట్టణ కేంద్రం, దేశాయిపేట గ్రామంలో ఏర్పాటు చేసిన రైతుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలలో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. మొదటగా భాస్కర్‌ రెడ్డి నియోజక వర్గ ప్రజా ప్రతినిదులు, రైతులతో కలిసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌, తెలంగాణ రాష్ట్ర శాసన …

Read More »

దోమకొండలో కుల బహిష్కరణ

కామారెడ్డి, జనవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో కుల బహిష్కరణ చేశారని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎస్పీ, కామారెడ్డి డిఎస్పీలకు ఫిర్యాదు చేశారు. పెరిక కులానికి చెందిన నల్లపు చంద్రం, నల్ల రాజు, నల్లపు నరేష్‌ కుటుంబాలను పెరిక సంఘం నుంచి కుల బహిష్కరణ చేశారని జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. తమ సొంత భూమి విషయంలో వివాదం జరిగిందని …

Read More »

ఎం.ఎడ్‌. మొదటి సెమిస్టర్‌ పరీక్షా ఫలితాల విడుదల

డిచ్‌పల్లి, జనవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల్యంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ మొదటి, రెండవ సెమిస్టర్స్‌ అలాగే ఎం.ఎడ్‌. మొదటి సెమిస్టర్‌ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. ఎం. అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ మొదటి సెమిస్టర్‌ పరీక్షలో 14 వేల 158 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 2 వేల 933 మంది …

Read More »

కామారెడ్డిలో కారుణ్య నియామకాలు

కామారెడ్డి, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ది నిజామాబాద్‌ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్‌ దేవునిపల్లి శాఖలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా విధులు నిర్వహించిన దాసరి రమేష్‌ గత ఏడాది ఏప్రిల్‌ నెలలో కోవిడ్‌ సోకి మరణించడం వలన కారుణ్య నియామకంగా తన కుమారుడు అయిన ప్రదీప్‌ కుమార్‌కు అటెండర్‌గా, అదేవిధంగా కామారెడ్డి శాఖలో అటెండర్‌గా విధులు నిర్వహించిన రవీందర్‌ గత ఏడాది మే నెలలో కోవిడ్‌ …

Read More »

రేపు ముగ్గుల పోటీలు

కామారెడ్డి, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రేపు శనివారం కామారెడ్డి మార్కెట్‌ కమిటీ ఆధ్వర్యంలో గాంధీ గంజ్‌లో ఉదయం 11 గంటలకు రైతు బంధు వారోత్సవాలలో బాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించనున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ హాజరు కానున్నట్టు కామారెడ్డి నియోజకవర్గ తెరాస పార్టీ అధికార ప్రతినిధి బలవంతరావు తెలిపారు. పోటీలలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Read More »

ఓటరు చైతన్యవంతుడైనప్పుడే ప్రజాస్వామ్యం బలపడుతుంది

కామారెడ్డి, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటరు చైతన్యవంతుడైనప్పుడే ప్రజాస్వామ్యం బలపడుతుందని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ జితేశ్‌ వి పాటిల్‌ అన్నారు. శుక్రవారం జిల్లా ఎన్నికల విభాగం ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, డిగ్రీ, వృత్తివిద్య కళాశాలలో ఈ కార్యక్రమాన్ని ప్రొజెక్టర్ల ద్వారా విద్యార్థులకు ప్రదర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కొత్తగా నమోదైన ఓటర్లు ఓటుహక్కును నిజాయితీతో వినియోగించుకోవాలని …

Read More »

సమాచార హక్కు చట్టం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం…

కామారెడ్డి, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం కామారెడ్డి జిల్లా మున్సిపల్‌ పరిధిలో గల నరసన్న పల్లి శివారులో గల ఇందిరమ్మ ఇళ్లలో పేద ప్రజలకు జీవ్‌ ఆయుర్వేదిక్‌ అనువంశిక వైద్యులు ఎంవీ భాస్కర్‌ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించినట్టు అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ జిల్లా ఇంచార్జ్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్‌ రావు అన్నారు. ఈ …

Read More »

ఆరేపల్లి పాఠశాలలో సంక్రాంతి సంబరాలు…

కామారెడ్డి, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆరేపల్లి ప్రాథమిక పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారని, కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజంపేట మండల తాసిల్దార్‌ జానకి హాజరయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా తాసిల్దార్‌ జానకి మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతి ఒక్కరు గౌరవించాలని, నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి పాఠశాల స్థాయిలో ఇలాంటి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »