కామారెడ్డి, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజికవర్గంలోని 27 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 27 లక్షల 44 వేల 500 రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజికవర్గంలో ఇప్పటివరకు 1101 మందికి 7 కోట్ల 97 లక్షల 8 వేల రూపాయల చెక్కులను …
Read More »Monthly Archives: January 2022
వేతన పెంపు ఐక్య పోరాట విజయం
నిజామాబాద్, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ కార్మికులకు 30 శాతం వేతన పెంపును అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్‌టియు) ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికులు మిఠాయిలు పంచుకొని విజయోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఐ.ఎఫ్.టి.యు రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ, తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్‌టియు) …
Read More »కామారెడ్డి రక్తదాతలు తెలంగాణ రాష్ట్రానికే ఆదర్శం
కామారెడ్డి, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మెదక్ జిల్లా కేంద్రంలోని కేర్ వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తమై అనురాధ (30) ఏ నెగిటివ్ రక్తం లభించకపోవడంతో వారి బంధువులు కామారెడ్డి రక్త దాతల సమూహన్ని గురించి తెలుసుకొని నిర్వాహకులు బాలును సంప్రదించారు. దీంతో చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన అనిల్ రెడ్డి సహకారంతో ఏ నెగిటివ్ రక్తాన్ని సకాలంలో అందజేసి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్బంగా బాలు మాట్లాడుతూ …
Read More »పోరాట ఫలితమే మున్సిపల్ కార్మికుల వేతనాల పెంపు
బోధన్, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలోని మున్సిపల్ కార్మికులు కార్మిక సంఘాల జేఏసీ నాయకత్వంలో చేసిన పోరాట ఫలితంగానే మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెరిగాయని ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి బి. మల్లేష్, సిఐటియు జిల్లా నాయకులు జే. శంకర్ గౌడ్ అన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా బి. మల్లేష్, జే. …
Read More »మాస్ కమ్యూనికేషన్‌లో శ్రీనివాస్ గౌడ్‌కు డాక్టరేట్
డిచ్‌పల్లి, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో మాస్ కమ్యూనికేషన్ పరిశోధక విద్యార్థి ఇ. శ్రీనివాస్ గౌడ్ కు పిహెచ్. డి. డాక్టరేట్ పట్టా ప్రదానం చేయబడిరది. ఆయన రూపొందించిన సిద్ధాంత గ్రంథం మీద తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మినీ సెమినార్ హాల్‌లో ఓపెన్ వైవా వోస్ (మౌఖిక పరీక్ష) నిర్వహించారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని మాస్ కమ్యూనికేషన్ విభాగంలో గల …
Read More »డిగ్రీ, పిజి తరగతులు వాయిదా
నిజామాబాద్, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డా.బి.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఈనెల 8, 9వ తేదీల్లో జరగాల్సిన డిగ్రీ, పిజి తరగతులు ఉమ్మడి జిల్లా అధ్యయన కేంద్రాలు బాన్సువాడ, కామారెడ్డి, బోధన్, మోర్తాడ్, ఆర్మూర్, భీమ్‌గల్, బిచ్కుంద, ఎల్లారెడ్డి లో కరోనా నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ సూచన మేరకు 8వ తేదీ నుండి 16వ తేదీ వరకు సెలవులు ప్రకటించడం వల్ల వాయిదా వేసినట్టు అధ్యయన …
Read More »టీయూలో న్యూ ఇయర్ వేడుకలు
డిచ్‌పల్లి, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిపాలనా భవనంలో గల ఎగ్జిక్యూటివ్ హాల్‌లో కొత్త సంవత్సర (2022) వేడుకలు నిర్వహించారు. పరిపాలనా భవనం సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహింపబడిన ఈ కార్యక్రమానికి ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో ఉద్యోగులందరికి, వారి వారి కుటుంబ సభ్యులకు కూడా అన్ని శుభాలు కలగాలని కోరుకున్నారు. సిబ్బంది …
Read More »వసతి గృహాలు సందర్శించిన వీసీ
డిచ్‌పల్లి, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బాలుర పాత, కొత్త వసతి గృహాలను ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ శుక్రవారం ఉదయం సందర్శించారు. సంక్రాంతి సెలవులకు ఈ నెల 8 నుంచి 16 వరకు హాస్టల్స్ మూసి వేస్తున్న సందర్భంలో వీసీ వెళ్లారు. హాస్టల్స్‌లో గదులను, ఇతర సదుపాయాలను పరిశీలించారు. హాస్టల్స్‌లో కొన్ని అవసరం ఉన్న వాటికి మరమత్తులు చేయించి, పేయింట్ వేయించాలని …
Read More »గోదాం నిర్మాణాలు త్వరగా పూర్తిచేయాలి
కామారెడ్డి, జనవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈవీఎం గోదాము నిర్మాణం పనులను జనవరి 31 లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డిలో కొత్తగా నిర్మిస్తున్న గోదాం పనులను గురువారం ఆయన పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఈఈ రవిశంకర్, డిఈ శ్రీనివాస్, ఏఈ రవితేజ, ఎన్నికల సూపరింటెండెంట్ సాయి …
Read More »హరితహారం మొక్కలను పూర్తిస్థాయిలో కాపాడాలి
నిజామాబాద్, జనవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హరిత హారంలో నాటిన మొక్కలను పూర్తిస్థాయిలో కాపాడడం ద్వారా వచ్చే సంవత్సరం అవెన్యూ ప్లాంటేషన్ అవసరం లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం వీడియో కాన్ఫరెన్సు హాల్ నుండి హరితహారం, ఓమిక్రాన్, లేబర్ టర్న్ ఔట్‌పై మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీఎం …
Read More »