Monthly Archives: January 2022

తెలంగాణ ఎకనమిక్‌ అసోసియేషన్‌ సదస్సు విజయవంతం చేయండి

డిచ్‌పల్లి, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఫిబ్రవరి 12, 13న జరిగే తెలంగాణ ఎకనమిక్‌ అసోసియేషన్‌ ఆరవ వార్షిక సదస్సును విజయవంతం చేయాలని ప్రొ. లింగమూర్తి, మాజీ వైస్‌ ఛాన్స్‌లర్‌, తెలంగాణ ఎకనమిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఎగ్జిక్యూటివ్‌ హాల్‌లో జరిగిన అర్థశాస్త్ర అధ్యాపకుల సమన్వయ సమావేశానికి హాజరై సదస్సు నిర్వహణకు దిశానిర్దేశనం చేశారు. ఫిబ్రవరిలో జరిగే రెండు రోజుల సదస్సులో …

Read More »

పివైఎల్‌ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

నిజామాబాద్‌, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రగతిశీల యువజన సంఘం (పివైఎల్‌) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఎన్‌.ఆర్‌ భవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈనెల 4న గడ్కొల్‌లో జరిగిన జిల్లా జనరల్‌ కౌన్సిల్‌లో ఎన్నుకోబడ్డ ప్రగతిశీల యువజన సంఘం నూతన జిల్లా కార్యవర్గాన్ని ప్రకటించారు. జిల్లా అధ్యక్షులుగా బట్టు కిషన్‌, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎం. సుమన్‌, ఉపాధ్యక్షులుగా మారుతి గౌడ్‌, …

Read More »

కేర్‌ డిగ్రీ కళాశాలలో కరోనా వ్యాక్సినేషన్‌

నిజామాబాద్‌, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత రెండు రోజులుగా స్థానిక కేర్‌ డిగ్రీ కళాశాలలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతుందని కళాశాల డైరెక్టర్‌ నరాల సుధాకర్‌ తెలిపారు. ఇందులో భాగంగా విద్యార్థులు వ్యాక్సినేషన్‌ చేయించుకుంటున్నారన్నారు. అంతేకాకుండా స్థానికంగా ఉన్న ప్రజలు కూడా వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వ్యాక్సిన్‌తో పాటు కరోనాను ఎదుర్కొనేందుకు విద్యార్థులందరు విధిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటిస్తూ …

Read More »

చురుకుగా కొనసాగుతున్న కొవాక్సీన్‌ ప్రక్రియ

నవీపేట్‌, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశవ్యాప్తంగా పిల్లలకు ఇచ్చే కొవాక్సీన్‌ ప్రకియ చురుకుగా సాగుతుంది. పలుచోట్ల ఆరోగ్యకేంద్రానికి సంబంధించిన ఏఎన్‌ఎం, ఆశవర్కర్స్‌ ప్రతేక్యంగా పాఠశాలకు వెళ్లి టీకాలు వేస్తున్నారు. ఇప్పటి వరకు 140 మంది పిల్లలకి కొవాక్సీన్‌ టీకా వేసినట్టు తెలిపారు. తల్లిదండ్రులు కొవాక్సీన్‌ టీకాపై అపోహలు వీడాలని, 17 సంవంత్సరాల వయసు ఉన్న ప్రతిఒక్కరు వాక్సినేషన్‌ చేయించుకోవాలన్నారు. ఆరోగ్యకేంద్రంలో టీకా అందుబాటులో ఉందన్నారు. …

Read More »

థర్డ్‌ వేవ్‌ వచ్చినా ఆక్సిజన్‌ సమస్య రాకుండా చర్యలు

మోర్తాడ్‌, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా మూడవ వేవ్‌ వచ్చినా ఏ ఒక్క పేదవాడు కూడా ఆక్సిజన్‌ దొరక్క ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో పలు మండలాల్లోని ఆరోగ్య కేంద్రాలు ఐసియు బెడ్స్‌ ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాలు, గృహ నిర్మాణ శాఖల మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. బుధవారం మోర్తాడ్‌ మండల కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో …

Read More »

సమాచారం తెలపండి… వివరాలు గోప్యంగా ఉంచుతాం…

నిజామాబాద్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీస్‌ కమీషనరేటు పరిధిలోని నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌ డివిజినల్‌ పరిధిలో ఎక్కడైనా మట్కా, గుట్కా, పేకాట, ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నడుస్తున్నట్లు తెలిసిన అలాంటి వారి సమాచారం ఈ దిగువ ఫోన్‌ నెంబర్లకు తెలియజేయాలని నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కె.ఆర్‌. నాగరాజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమాచారం తెలియజేసిన వారికి ప్రత్యేకరివార్డు ఇవ్వడం జరుగుతుందని, సమాచారం …

Read More »

10 వరకు రైతుబంధు వారోత్సవాలు

కామారెడ్డి, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 10వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో రైతుబంధు వారోత్సవాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో మంగళవారం జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతుబంధు, భీమ, యాసంగిలో పంటల నమోదుపై అధికారులతో జిల్లా కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 3 నుంచి రైతుబంధు వారోత్సవాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. …

Read More »

తక్కువ ఖర్చుతో నాణ్యమైన కూరగాయలు పండిరచవచ్చు….

కామారెడ్డి, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సేంద్రియ వ్యవసాయం ద్వారా కూరగాయల సాగు చేపట్టి అధిక లాభాలు పొందాలని రాష్ట్ర ఎస్సి డెవలప్‌మెంట్‌ అడిషనల్‌ సెక్రటరీ విజయ్‌ కుమార్‌ అన్నారు. రాజంపేట మండలం శివాయిపల్లిలో జిల్లా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో సేంద్రీయ పద్ధతిలో కూరగాయల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సేంద్రీయ పద్ధతిలో కూరగాయల సాగు చేయడం …

Read More »

ప్రకృతి వనాల పనులు త్వరిత గతిన పూర్తి చేయాలి

కామారెడ్డి, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బృహత్‌ పల్లె ప్రకృతి వనాల పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో మంగళవారం మండల స్థాయి అధికారులతో పల్లె ప్రగతి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. గ్రామాల్లోని నర్సరీలలో బ్యాగ్‌ ఫీలింగ్‌ పూర్తిచేయాలని సూచించారు. మండలాల వారీగా …

Read More »

అర్చరీ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి

కామారెడ్డి, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా అర్చరీ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. దోమకొండ మండల కేంద్రంలో గడికోటలో ఉన్న ఆర్చరీ శిక్షణ కేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. క్రీడాకారులు శిక్షణలో తగిన మెళకువలు నేర్చుకోవాలని సూచించారు. క్రీడల వల్ల క్రమశిక్షణ అలవడుతుందని చెప్పారు. క్రీడలు ఆరోగ్య పరిరక్షణకు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »