కామారెడ్డి, జనవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కారం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జిల్లా అధికారులకు సూచించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ఆయన సోమవారం ప్రజావాణికి హాజరై మాట్లాడారు. ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అందించిన ప్రజా వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజల సమస్యలను అడిగి …
Read More »Monthly Archives: January 2022
పోటీతత్వంతో కూరగాయలు పండిరచాలి
కామారెడ్డి, జనవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు ఆధునిక పద్ధతులను వినియోగించి కూరగాయల సాగు చేపట్టి అధిక లాభాలు పొందాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. రాజంపేట మండలం శివాయిపల్లిలో సోమవారం పంటల మార్పిడి విధానంపై ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతులు పోటీ తత్వంతో కూరగాయ పంటలు పండిరచాలని సూచించారు. …
Read More »రైతుబంధుపై విజయోత్సవాలు నిర్వహించాలి
నిజామాబాద్, జనవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సబ్సిడీ కింద అందిస్తున్న రైతుబంధు పై విజయోత్సవ కార్యక్రమాలు ఈ నెల 10 వరకు నిర్వహించాలని, జిల్లాలో మార్చి చివరి నాటికి దళిత బంధు కార్యక్రమంలో 100 యూనిట్లు గ్రౌండిరగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ ప్రగతి భవన్ సమావేశ మందిరంలో జిల్లా …
Read More »కొత్త సంవత్సరంలో అందరికీ మంచి జరగాలి
కామారెడ్డి, జనవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొత్త సంవత్సరం 2022 లో అన్ని వర్గాల ప్రజలకు మంచి జరగాలని కామారెడ్డి జిల్లా జడ్జి రమేష్ బాబు పేర్కొన్నారు. సోమవారం బార్ అసోసియేషన్ హాల్‌లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా జడ్జి రమేష్ బాబు మాట్లాడుతూ, న్యాయమూర్తులకు, న్యాయవాదులకు, కక్షిదారులకు మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు. సభాధ్యక్షత వహించిన బార్ …
Read More »మహిళా హక్కుల కొరకు నినదించిన గళం సావిత్రి బాయి
నిజామాబాద్, జనవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చదువుల తల్లి సావిత్రి బాయి ఫూలే 191వ జయంతి వేడుకలు నిర్వహించారు. కేవలం బడుగు బలహీన వర్గాల వారికే కాకుండా అగ్ర వర్ణాల నిరుపేదలకు కూడ తాను స్థాపించిన పాఠశాలలో 150 సంవత్సరాల క్రిందటే చదువు నేర్పిన గొప్ప దార్శనికురాలు సావిత్రి బాయి ఫూలే అని నాయకులు పేర్కొన్నారు. తమ …
Read More »తాత్కాలికంగా నుమాయిష్ వాయిదా
హైదరాబాద్, జనవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోవిడ్-19 ఒమిక్రాన్ వేరియంట్ ముప్పు కారణంగా రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ సభలను నిషేధించడంతో, నుమాయిష్‌గా ప్రసిద్ధి చెందిన వార్షిక ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ జనవరి 10 వరకు నిలిపివేసినట్టు అధికారులు పేర్కొన్నారు. కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టడానికి జనవరి 10 వరకు మత, రాజకీయ మరియు సాంస్కృతిక సహా అన్ని రకాల ర్యాలీలు, బహిరంగ సభలు, సామూహిక …
Read More »మండల సభలో బినామీలకూ అవకాశం కల్పిస్తాం
గాంధారి, జనవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండల సర్వ సభ్య సమావేశంలో బినామీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు అవకాశం కల్పిస్తామని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జజాల సురేందర్ అన్నారు. సోమవారం గాంధారి మండల సర్వసభ్య సమావేశం స్థానిక ఎంపీపీ రాధా బలరాం అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్బంగా సమావేశానికి ముఖ్య అథితిగా ఎమ్మెల్యే సురేందర్ హాజరైయ్యారు. సమావేశానికి మండలంలోని పలు గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్‌లు హాజరైయ్యారు. అందులో కొంతమంది …
Read More »అభివృద్ధిలో తెలంగాణ ఫస్ట్
గాంధారి, జనవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలుస్తుందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జజాల సురేందర్ అన్నారు. సోమవారం గాంధారి మండల కేంద్రంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. స్థానిక రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే అందరికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ఇదంతా ముఖ్యమంత్రి కెసిఆర్ …
Read More »సావిత్రిబాయి పూలే గొప్ప మానవతావాది
కామారెడ్డి, జనవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సావిత్రిబాయి పూలే గొప్ప మానవతావాది అని కామారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు గజ్జెల బిక్షపతి పేర్కొన్నారు. సోమవారం బార్ అసోసియేషన్ హాల్‌లో సావిత్రిబాయి పూలే జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గజ్జెల బిక్షపతి మాట్లాడుతూ భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా, మానవ హక్కుల కోసం పోరాడిన మానవతా వాదిగా, సావిత్రిబాయి పూలేను కొనియాడారు. అన్ని …
Read More »డిగ్రీ విద్యార్థులకు ముఖ్య గమనిక..
డిచ్‌పల్లి, జనవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని ఇటీవల విడుదల అయిన యుజి 3వ, 4వ రెగులర్ థియరీ పరీక్షలకు సంబందించిన రివ్యాల్యూషన్, రీకౌంటింగ్ సంబందించిన అప్లికేషన్లను విద్యార్థులు వారి కళాశాలలో ఈనెల 10వ తేదీలోపు అందజేయాలని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు కళాశాల ప్రిన్సిపాల్‌ను, పూర్తి వివరాలు విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో పొందవచ్చని పేర్కొన్నారు.
Read More »