నిజామాబాద్, జనవరి 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజల ఆహ్లాదం కోసం ఏర్పాటు చేస్తున్న అర్బన్ పార్క్ పనులను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) చిత్రా మిశ్రా, జిల్లా అటవీ శాఖ అధికారి సునీల్‌తో కలిసి నిజామాబాద్ శివారులోని చిన్నపూర్ రిజర్వ్ ఫారెస్టు వద్ద ఏర్పాటు చేస్తున్న అర్బన్ పార్కును సందర్శించారు. ఇక్కడ …
Read More »Monthly Archives: January 2022
పండరిపూర్ కాలినడక భక్తులకు సన్మానం..
గాంధారి, జనవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారీ మండలం ముదెల్లి గ్రామంలో ముదెల్లి నుండి పండరిపూర్ వెళ్తున్న కాలినడక భక్తులకు మదన్ మోహన్ టోపీ, మాస్క్, కండువాలను భక్తులకు అందజేశారు. కార్యక్రమంలో జామున వెంకట్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సంపత్, గాంధారి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కృష్ణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తూర్పు రాజు, …
Read More »ఎల్లారెడ్డి బార్ కౌన్సిల్ నూతన ప్రెసిడెంట్‌కు సన్మానం
ఎల్లారెడ్డి, జనవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నూతనంగా ఏర్పాటైన బార్ కౌన్సిల్ కమిటీ ప్రెసిడెంట్ పద్మ పండరిని జాతీయ బీసీ సంక్షేమ సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కాముని సుదర్శన్ నేత, ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంచార్జి చింతల శంకర్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ హల్‌లో జరిగిన సమావేశంలో పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కాశిరామ్, బీసీ యూత్ జిల్లా ప్రెసిడెంట్ …
Read More »తొర్తి బహిష్కరణ వివాదంపై మంత్రి ప్రశాంత్ రెడ్డి మౌనమేలా?
నిజామాబాద్, జనవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏర్గట్ల మండలం తొర్తి గ్రామంలో రెండు నెలలుగా మాల, మాదిగ, గుండ్ల, చాకలి, కుమ్మరి, కమ్మరి, ముదిరాజ్, పద్మశాలి, గొల్ల ఇతర మైనారిటీ కులస్తులందరికీ సాంఘిక బహిష్కరణ విధించిన ఆధిపత్య మున్నూరు కాపు వర్గంపై కేసులు నమోదు చేయాలని జరుగుతున్న ఆందోళనలపై మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పందించాలని, తన నియోజకవర్గంలోని గ్రామంలో బహిష్కరణ వివాద పరిష్కారానికి కృషి చేయాల్సిన …
Read More »దొంగ అరెస్ట్, రిమాండ్
కామారెడ్డి, జనవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో శుక్రవారం అనుమానస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు విచారించగా భయపడి చేసిన దొంగతనం ఒప్పుకోగా అసలు విషయం బయటపడిరది. గతంలో జరిగిన దొంగతనం కేసులో పోయిన సొత్తు రికవరీ అయినట్లు డిఎస్పీ సోమనాదం తెలిపారు. రాజంపేట పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 12న అరగొండ గ్రామానికి …
Read More »నామ్ కే వాస్తే అన్నట్టుగా పనిచేస్తే ప్రయోజనం ఉండదు
నిజామాబాద్, జనవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పచ్చదనం పెంపొందిస్తూ, పర్యావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న హరితహారం కార్యక్రమంలో మొక్కల నిర్వహణ ఎంతో కీలకం అని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రాతో కలిసి నిజామాబాద్ నగరంలోని సాయినగర్, నాగారం, సారంగపూర్, బైపాస్ రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలను పరిశీలించారు. …
Read More »అర్హులైన అందరికి తప్పకుండా వ్యాక్సినేషన్ చేయాలి
కామారెడ్డి, జనవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అర్హులైన వారందరికీ వంద శాతం వ్యాక్సినేషన్ వేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో శుక్రవారం ఆయన టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రెండు డోసులు తీసుకున్న ఫ్రంట్ లైన్ వర్కర్స్ బూస్టర్ డోస్ తీసుకునే విధంగా చూడాలని కోరారు. ఆరోగ్య కేంద్రాల వారీగా వ్యాక్సినేషన్‌పై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు …
Read More »రెండు రోజుల్లో పనులు పూర్తిచేయాలి…
కామరెడ్డి, జనవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈవీఎం గోదాం నిర్మాణం పనులను పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం ఆయన ఈవీఎం గోదాం నిర్మాణ పనులను పరిశీలించారు. రెండు రోజుల్లో పనులను పూర్తి చేయాలని ఆర్‌అండ్‌బి ఎఈ రవితేజకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఎన్నికల సూపరింటెండెంట్ సాయి భుజంగరావు, అధికారులు పాల్గొన్నారు.
Read More »రాజీవ్ స్వగృహ నిర్మాణాలు పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, జనవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని అడ్లూరు శివారులో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్‌లో నిర్మించిన గృహాలను, స్థలాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. పిచ్చి మొక్కల చెత్తను టిప్పర్ల ద్వారా తొలగించాలని సూచించారు. ఫార్మేషన్ రోడ్లు వేయాలని కోరారు. ప్రతి ప్లాటుకు క్రమ సంఖ్య కేటాయించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, …
Read More »ఉమెన్ సెల్ ఆధ్వర్యంలో ‘‘సైబర్ నేరాలు – మహిళా సంరక్షణ’’ అవగాహనా సదస్సు
డిచ్‌పల్లి, జనవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం మహిళా విభాగం ఆధ్వర్యంలో షీ టీం, నిజామాబాద్ సౌజన్యంతో ఈ నెల 30 వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు ‘‘సైబర్ నేరాలు – మహిళా సంరక్షణ’’ అనే అంశం మీద అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ డా. కె. అపర్ణ ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో షీ టీం, నిజామాబాద్ మహిళా కానిస్టేబుల్స్ …
Read More »