నిజామాబాద్, ఫిబ్రవరి 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వ్యక్తిగత ఆదాయం పొందుతున్న మధ్యతరగతి వారికి పన్ను పరిమితి పది లక్షలకు పెంచాలని, ఆదాయపు పన్ను శ్లాబులను మార్చాలని, కోట్లాదిమంది ప్రభుత్వాన్ని కోరుతున్నారని, వారికి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ మొండి చేయి చూపించిందని ఆల్ పెన్షన్నర్స్ అసోసియేషన్ సభ్యులు రామ్మోహన్ రావు అన్నారు.
కరోనాలో కూడా లక్షల కోట్లు సంపాదించిన, పన్ను చెల్లించ గలిగిన పెద్దపెద్ద కార్పొరేట్లకు పన్నులలో (30 శాతం నుండి 22 శాతం) రాయితీలు ఇస్తూ, వేతన జీవులు వద్దనుండి అత్యధిక పన్ను 30 శాతం వసూలు చేయడం చూస్తే, ప్రభుత్వం ఎవరి కోసం పని చేస్తుందో స్పష్టమవుతుందన్నారు. మధ్య తరగతి ఉద్యోగులు ఇప్పటికైనా మోడీ మాయ నుండి బయటపడాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. సామాన్య ఉద్యోగి కూడా పన్ను చెల్లించే వారి జాబితాలోకి వచ్చారని, జిఎస్‌టి తరువాత అత్యధికంగా పన్నులు చెల్లిస్తున్నవారు వేతన జీవులేనని గుర్తుంచుకోవాలన్నారు.