డిచ్‌పల్లి, ఫిబ్రవరి 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బాలుర, బాలికల హాస్టల్స్‌ను మంగళవారం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్ సందర్శించారు.
పాత బాలుర హాస్టల్‌లో జరుగుతున్న మరమ్మత్తు పనులను పర్యవేక్షించారు. హాస్టల్స్ గదులకు రంగులు వేయడం, తలుపులు, కిటికీలకు వడ్రంగి పని, గోడలకు, నేలకు రంధ్రాలు పడిన చోట సిమెంట్ పనులు, కుల్లాయిలను బాగుచేయడం, పాడైపోయిన కొత్త బల్బులను పెట్టించడం, సీలింగ్ ఫ్యాన్‌లను రిపేర్ చేయించడం, ఫర్నిచర్ రిపేరింగ్ వంటివి పనులు జరుగుతున్నాయి. వాటిని పర్యవేక్షించిన వీసీ తగు సూచనలు చేశారు.
తర్వాత బాలికల హాస్టల్‌ను సందర్శించి గదులకు, పరిసర ప్రదేశాలకు శానిటైజేషన్ జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. హాస్టల్స్ పర్యవేక్షించే సమయంలో అసిస్టెంట్ ఇంజనీర్ వినోద్ కుమార్, కేర్ టేకర్స్ క్రాంతి కుమార్, దిగంబర్ చౌహాన్, ఎలక్ట్రిషన్ నాగరాజు, ప్లంబర్ సుదర్శన్ తదితరులు ఉన్నారు.