నిజామాబాద్, ఫిబ్రవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొవిడ్ నియంత్రణ కోసం చేపడుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన వైద్యాధికారులతో పాటు ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్‌లు, ఎంపీడీవోలు, ఉపాధి హామీ ఏపీవోలు తదితర శాఖల అధికారులతో సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యాక్సినేషన్, ఉపాధి హామీ కింద కూలీలకు విస్తృత స్థాయిలో పనులు కల్పించడం, హరితహారం మొక్కల నిర్వహణ, …
Read More »Daily Archives: February 3, 2022
నసురుల్లాబాద్‌లో బిజెపి దీక్ష
నసురుల్లాబాద్, ఫిబ్రవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం నసురుల్లాబాదు మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భీమ్ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు చందూరి హన్మాండ్లు మాట్లడుతూ శాంతి యుతంగా దీక్ష చేస్తున్న తమను పోలీసులు అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని మార్చాలంటూ సీఎం కేసీఆర్ సిగ్గు లేకుండా, …
Read More »అభివృద్ది పనుల ప్రగతికి తోడ్పాటు అందించండి
నిజామాబాద్, ఫిబ్రవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించి వివిధ శాఖల ఆధ్వర్యంలో, ఆయా పథకాల ద్వారా మంజూరైన నిర్మాణ పనులను మార్చి నెలాఖరు నాటికి పూర్తి అయ్యేలా ప్రజాప్రతినిధులు తోడ్పాటును అందించాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి కోరారు. గురువారం కలెక్టర్ తన ఛాంబర్ నుండి ఆయా మండలాల ఎంపీపీలు, జెడ్‌పీటీసీలతో సెల్ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, సాంఘిక సంక్షేమం, ఉపాధి …
Read More »మూడు అంతర్జాతీయ నానో టెక్నాలజీ జర్నల్స్‌లో వీసీ ప్రచురణలు
డిచ్‌పల్లి, ఫిబ్రవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీలో ప్రపంచ ర్యాంక్ పొంది సుప్రసిద్ధ శాస్త్ర వేత్తల్లో ఒకరుగా గుర్తింపు పొందిన తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ మరో మూడు అంతర్జాతీయ పత్రికల్లో మెమరీ డివైసెస్, స్పిన్ డ్రాన్ డివైసెస్, డ్రగ్ డెలవరి అండ్ నానో టెక్నాలజీ మీద విస్తృతమైన ప్రయోగాలు చేసిన పరిశోధనా పత్రాలు ప్రచురణ పొందాయని ఒక ప్రకటనలో …
Read More »ప్రభుత్వ విప్‌ను కలిసిన జిల్లా రెడ్ క్రాస్ ప్రతినిధులు
కామారెడ్డి, ఫిబ్రవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్‌ని జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ రాజన్న, వైస్ చైర్మన్ అంకన్నగారి నాగరాజ్ గౌడ్, కోశాధికారి దస్తిరాం, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సంజీవరెడ్డి, సెక్రటరీ రఘుకుమార్, డివిజన్ ఛైర్మన్ రమేష్ రెడ్డి, జిల్లా కరస్పాండెట్ పీవీ నర్సింహం, వైస్ చైర్మన్ లక్ష్మణ్, డివిజన్ సెక్రటరీ జమిల్, కామారెడ్డి మండల చైర్మన్ నితీష్ …
Read More »వేములవాడ రాజన్న ఆలయానికి 600 వందల లీటర్ల సానిటైజర్లు, 20 వేల మాస్క్‌ల విరాళం
వేములవాడ, ఫిబ్రవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దక్షిణ కాశీగా పేరుప్రతిష్టలు పొంది భక్తుల ఇలవేల్పు అయిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు అనునిత్యం వేలల్లో భక్తులు వస్తూ ఇక్కడ నుండి మేడారం సమ్మక్క జాతర ఉత్సవాలకు వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని అనంతరం అక్కడికి వెళ్లడం ఆనవాయితీ. కావున భక్తులకు కరోనవైరస్ బారిన పడకుండా ఉండేందుకు గురువారం రోజున వేములవాడ వాస్తవ్యులు …
Read More »కాంగ్రెస్ పార్టీ మాచారెడ్డి మండల ప్రధాన కార్యదర్శిగా బ్రహ్మానంద రెడ్డి
కామారెడ్డి, ఫిబ్రవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాచారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మినుకురి బ్రహ్మానందరెడ్డి నియమితులయ్యారు. టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అదేశాలు మేరకు గురువారం కాంగ్రెస్ పార్టీ మాజీమంత్రి మాజీ ప్రతిపక్ష నేత సమన్వయం కమిటీ తెలంగాణ కన్వీనర్ మహ్మద్ షబ్బీర్ అలీ చుక్కాపూర్ గ్రామానికి చెందిన మినుకురి బ్రమనందరెడ్డికి మాచారెడ్డి మండల ప్రధాన కార్యదర్శిగా నియమించి నియమాక పత్రాన్ని అందజేశారు. …
Read More »ప్రత్యక్ష తరగతులతో పాటు ఆన్‌లైన్ బోధన కొనసాగించాలి
హైదరాబాద్, ఫిబ్రవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. విచారణలో భాగంగా విద్యా సంస్థల్లో ఆన్‌లైన్ బోధన కూడా కొనసాగించాలని కోర్టు ఆదేశించింది. ఈ నెల 20 వరకు ప్రత్యక్ష తరగతులతో పాటు ఆన్‌లైన్ బోధన కొనసాగించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. హైదరాబాద్‌లో మార్కెట్లు, బార్లు, రెస్టారెంట్ల వద్ద కొవిడ్ నిబంధనలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ …
Read More »కళాశాలలను సందర్శించిన వీసీ
డిచ్‌పల్లి, ఫిబ్రవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ప్రధాన ప్రాంగణంలోని అన్ని కళాశాలలో గల విభాగాలను ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ గురువారం సందర్శించారు. ఈ నెల మొదటి తేదీ నుంచి ప్రత్యక్ష (భౌతికంగా) క్లాసులు ప్రారంభమైన సందర్బంలో అన్ని కళాశాలలను ఆయన పర్యవేక్షించారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్ మెంట్ కళాశాల, కంప్యూటర్ సైన్స్ కళాశాల, న్యాయ …
Read More »5 లోగా అకౌంట్లు ఓపెన్ చేయాలి…
కామారెడ్డి, ఫిబ్రవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఫిబ్రవరి 5 లోగా దళిత బందు లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లను తీయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం జూమ్ మీటింగ్ ద్వారా మండల స్థాయి అధికారులు, బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించారు. బ్యాంకర్లు లబ్ధిదారుల పేరిట దళిత బందు ప్రత్యేక ఖాతాలు తెరవాలని సూచించారు. లబ్ధిదారుల లిస్టు తీసుకుని …
Read More »