కామారెడ్డి, ఫిబ్రవరి 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఫిబ్రవరి 5 లోగా దళిత బందు లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లను తీయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం జూమ్ మీటింగ్ ద్వారా మండల స్థాయి అధికారులు, బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించారు.
బ్యాంకర్లు లబ్ధిదారుల పేరిట దళిత బందు ప్రత్యేక ఖాతాలు తెరవాలని సూచించారు. లబ్ధిదారుల లిస్టు తీసుకుని గ్రామస్థాయిలో అధికారులు వెరిఫై చేయాలని కోరారు. లబ్ధిదారులకు కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అవసరం ఉంటే తహసీల్దార్లు తక్షణమే ఇవ్వాలని పేర్కొన్నారు.
నియోజకవర్గాల వారీగా అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ రాజేందర్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, నోడల్ అధికారులు పాల్గొన్నారు.