కామారెడ్డి, ఫిబ్రవరి 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతాపార్టీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో డా. బిఆర్. అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాగాన్ని అవమానించిన సీఎం కేసీఆర్ వైఖరికి నిరసనగా మున్సిపల్ ముందుగల అంబేెడ్కర్ విగ్రహం దగ్గర ‘‘బిజెపి భీం దీక్ష’’ నిర్వహించారు.
అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.